Thu Dec 19 2024 18:13:36 GMT+0000 (Coordinated Universal Time)
మల్లారెడ్డి అల్లుడి కళాశాలలకు నోటీసులు
మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి కళాశాలలకు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు
మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి కళాశాలలకు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డికి చెందిన ఇంజినీరింగ్ కళాశాలను అక్రమంగా నిర్మించారని రెవెన్యూ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డికి దుండిగల్ లో ఎంఎల్ఆర్టీ, ఏరోనాటికల్ ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి.
చెరువును ఆక్రమించుకుని...
అయితే చెరువును ఆక్రమించుకుని ఈ కళాశాలలను నిర్మించారు. దామర చెరువును ఆక్రమించి నిర్మించిన ఈ కళాశాలల నిర్మాణాలను తొలగించాలని కోరారు. బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు చేపట్టారని రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే ప్రస్తుత విద్యాసంవత్సరం నడుస్తున్నందున కొంత సమయం ఇచ్చే అవకాశముందని రెవెన్యూ వర్గాలు తెలిపాయి. మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రస్తుతం మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.
Next Story